ఇది దుర్మార్గం.. తీన్మార్ మల్లన్నపై అల్లం నారాయణ ఫైర్‌..

122
- Advertisement -

చింతపండు నవీన్ ఉరఫ్ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ Q న్యూస్ లో ‘పోల్’ పేరిట రాష్ట్ర మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ”బాడీ షేమింగ్” కు పాల్పడడం దుర్మార్గమైనది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబ్ ఛానల్ పేరిట వాడుతున్న భాష జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమైనది. దీనిని ఎవరూ అంగీకరించరు. జర్నలిస్టుల పేరిట పత్రికా స్వేచ్ఛ పేరిట వాడుతున్న భాషను రాజకీయ విధానాల మీద కాకుండా కుటుంబ సభ్యులను వివాదాలకు లాగుతున్న ప్రయత్నాలను మీడియా అకాడమీ చైర్మన్‌గా నేను ఖండిస్తున్నాను ఇది జర్నలిజం కాదు.

ఈ భాష జర్నలిస్టులు వాడదగినది కాదు. పత్రికా స్వేచ్ఛ పేరిట ఇదొక అన్యాయమైన అప్రజాస్వామిక చర్య.ఇది దుర్మార్గం. యూట్యూబ్ ఛానళ్ల పేరిట సోషల్ మీడియాలో చలామణి అవుతున్న చాలా మంది ప్రాథమికంగా జర్నలిస్టులు కాదు. ఇది ప్రత్యేకంగా ఒక విద్వేష పూరితమైన ప్రాయోజిత ప్రచారంలో భాగంగానే జరుగుతుందని మీడియా అకాడమీ చైర్మన్‌గా భావిస్తున్నాను అన్నారు అల్లం నారాయణ.

- Advertisement -