బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 8 హైలైట్స్

210
bigg boss4

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 సక్సెస్‌ ఫుల్‌గా ఎనమిది ఎపిసోడ్‌లను పూర్తిచేసుకుంది. 8వ రోజు తొలి ఎలిమినేషన్ డేలో దర్శకుడు సూర్యకిరణ్ హౌస్‌ నుండి ఎలిమినేట్ కాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చారు సాయి.

8వ రోజు రాములో రాములా సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన నాగ్‌…నామినేషన్స్‌లో ఉన్న నలుగురిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు కాబట్టి.. వారిని ఊరికే పంపించకుండా ఆట పాటలతో పంపిద్దాం అంటూ మంచి డాన్స్‌తో జోష్‌ని నింపారు. ఇంటి సభ్యులను రెండు గ్రూప్‌లుగా విడగొట్టి.. బిగ్ బాస్ హౌస్‌లో ప్లే చేసిన సాంగ్‌కి రెండు గ్రూప్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున వచ్చి డాన్స్ చేయాలని …బెస్ట్ డాన్సర్ మాస్టర్ రాజశేఖర్ డిసైడ్ చేస్తారని తెలిపారు.

మొదటిగా జిగేల్ రాణి సాంగ్‌కి డాన్స్ చేయడానికి మొనాల్, మెహబూబ్‌లు పోటీ పడ్డారు. అనంతరం కళ్యాణి-సొహైల్‌లు పెద్ద పులి సాంగ్‌కి పోటీ పడా..కళ్యాణికి 7 మార్కులు, సొహైల్‌కి 6 మార్కులు ఇచ్చారు రాజశేఖర్. అనంతరం దేత్తడి హారిక- నోయల్‌లు పోటీ పడగా.. నాగార్జున ఇద్దరికీ చెరో 8 మార్కులు ఇచ్చారు. అలాగే రాజశేఖర్ మాస్టర్ ఇద్దరికీ 8 మార్కు చొప్పున ఇచ్చారు.

ఇక సిటీ మార్ సాంగ్‌కి అభిజిత్-టీవీ 9 యాంకర్ దేవిలు పోటీ పడగా.. బ్లాక్ శారీలో స్టెప్పులు వేసి రచ్చ చేసింది దేవి. చివరగా ఫినిషింగ్ టచ్ ఇస్తూ గంగవ్వ- రాజశేఖర్ మాస్టర్‌లు అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్‌కి అదిరిపోయే స్టెప్‌లు వేశారు. మొత్తంగా ఈ డాన్స్ కాంపిటేషన్‌లో గర్ల్స్ టీంకి 91 పాయింట్స్ రావడంతో విజేతగా ప్రకటించారు నాగార్జున.

డ్యాన్స్ కాంపిటిషన్ తర్వాత అఖిల్, మొహబూబ్‌లు సేఫ్‌లో ఉన్నారని దివి, సూర్యకిరణ్‌లలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారని తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే హౌస్ నుండి సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యారని తెలిపారు నాగ్‌. ఇక సూర్యకిరణ్ ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు వివిధ జంతువుల బొమ్మలు చూపించి..హౌస్‌లో ఉన్న ఎవరికి అవి మ్యాచ్ అవుతాయో తెలపాలని కోరగా ఎవరిని నొప్పించకుండా అద్భుతంగా విశ్లేషించాడు సూర్యకిరణ్.సూర్యకిరణ్ ఇంటినుండి బయటకు వచ్చిన వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నటుడు కుమార్ సాయిని హౌస్‌లోకి పంపించారు. మొత్తంగా తొలి ఎలిమినేషన్ ఎపిసోడ్ ఆధ్యంతం ఆసక్తిగా సాగింది.