ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలకు మరోసారి కరోనా పరీక్షలు..

119
pocharam

శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరుగుతున్న నేపద్యంలో సభ్యులు ఈరోజు సభ ప్రారంభానికి ముందే మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి , శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున అందరి క్షేమం దృష్ట్యా మంత్రులు, శాసనసభ్యులు, మండలి సభ్యులు ఈ ఉదయం 9 గంటల లోపు శాసనసభ భవనం, శాసనమండలి భవనాలలో వైద్య, ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ లలో కరోనా టెస్ట్ లను చేయించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా అసెంబ్లీ మరియు కౌన్సిల్ సిబ్బంది, మార్షల్స్, మీడియా రిపోర్టర్లు మరియు సమావేశాల కోసం బందోబస్తుకై కేటాయించిన పోలీసు సిబ్బంది కూడా మరోసారి కరోనా టెస్ట్ లు చేయించుకుని విధులకు హాజరు కావాలని..కరోనా నేపథ్యంలో అందరూ ఈ టేస్ట్ లను చేయించుకుని సహకరించాలని తెలిపారు.