మొక్కలు నాటిన బిగ్ బాస్ ఫేం అరియాన..

278
Ariyana Glory
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్ దేవి నాగవల్లి మరియు బిగ్ బాస్ 4 షో సోహెల్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రముఖ నటి, బిగ్ బాస్ షో 4 ఫేం అరియాన గ్లోరీ నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పచ్చదనం రోజు రోజుకు తగ్గిపోతుందని దానిని పెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ రోజు మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆమె అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా 1) అవినాష్ జబర్దస్త్, 2) శివ జ్యోతి యాంకర్, 3)గీతా మాధురి గాయని లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -