బిగ్ బాస్‌ కోసం కొత్త ఓటీటీ…?

94
bigg

కరోనాతో థియేటర్లు మూత పడటం, షూటింగ్ పూర్తయిన సినిమాలకు సరికొత్తమార్గంగా నిలిచింది ఓటీటీ. ఇప్పటికే పలు సంస్థలు, నిర్మాతలు ఓటీటీని ప్రారంభించి సినిమాలు రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు సైతం ఓటీటీని పెద్ద ఎత్తున ఆదరించారు. ఈ నేపథ్యంలో పలువురు హీరోలు సైతం ఓటీటీ బిజినెస్‌లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభంకానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కోసం ఓ కొత్త ఓటీటీ రాబోతుంది. ఈసారి సీజన్‌కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనుండగా సెప్టెంబర్ 5న షో ప్రారంభంకానుంది.

ప్రస్తుతం హాట్‌స్టార్ తెలుగు బిగ్ బాస్ టీవీ వెర్షన్‌ను ప్రసారం చేస్తోంది. బిగ్ బాస్ మేకర్స్ రియాలిటీ షో OTT వెర్షన్‌ ని ఏ OTT ప్లాట్‌ఫారమ్‌ లో టెలీకాస్ట్ చేస్తారనేది తేలాల్సి ఉంది. ఈ ఓటీటీ వెర్షన్ లో 24 గంటల పాటు బిగ్ బాస్ షో ప్రసారం ఉంటుందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే… బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ సరికొత్త ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ లో ఆడియన్స్ చూసేయవచ్చు.