అల్లు అర్జున్ స్పెషల్‌ మాస్క్‌.. పిక్‌ వైరల్‌

377
allu arjun

టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ శనివారం ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతాన్ని తన ఫ్రెండ్స్ తో కలిసి సందర్శించారు. లాక్ డౌన్ కారణంగా కొన్నాళ్లుగా ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్ ఇటీవలే బయట పబ్లిక్ ప్లేసుల్లో దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా బన్నీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే కుంటాల వచ్చిన బన్నీ సొంతంగా డిజైన్ చేసిన మాస్కు ధరించడం అభిమానులను ఆకర్షించింది. ఆ మాస్కుపై AA (అల్లు అర్జున్) అనే అక్షరాలు పొందుపరిచి ఉన్నాయి. తన డ్రెస్ కలర్ కు మ్యాచింగ్ మాస్కు ధరించిన బన్నీని ఫొటోలు తీసుకునేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు.

ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. పైగా పుష్ప చిత్రం కోసం పెంచిన ఉంగరాల జుత్తు కూడా బన్నీకి అదనపు సొగసు తెచ్చిపెట్టింది. కుంటాల జలపాతం వద్దకు వచ్చిన అల్లు అర్జున్ కు అధికారులు అక్కడి ప్రాశస్త్యాన్ని వివరించారు. కుంటాల జలపాతం… రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేర్కొంది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం ‘పుష్ప’ తెలిసిందే. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో నిర్మితం కానున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.