రాజ్‌తరుణ్‌ మూవీలో అరియానా!

554
raj tharun

బిగ్ బాస్‌ తెలుగు సీజన్‌ 4తో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న బ్యూటీ అరియానా. బిగ్ బాస్‌లో టాప్‌ 5లో నిలిచిన అరియానా వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా గుడ్ న్యూస్ తెలిపింది.

హీరో రాజ్ త‌రుణ్, ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ గ‌విరెడ్డి(సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు ఫేమ్)తో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. అతి త్వ‌ర‌లో ఎగ్జైటింగ్ వార్త రానుంది. బిగ్ బాస్ త‌ర్వాత నా జీవితంలో ఓ మంచి రోజు అని తెలిపింది.

తనకు అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గ‌విరెడ్డికి థ్యాంక్స్ చెబుతూ రాజ్ తరుణ్ నువ్వు అమేజింగ్ అని కామెంట్ పెట్టింది.అలానే అన్న‌పూర్ణ బేన‌ర్‌ని హ్యాష్ ట్యాగ్‌తో జ‌త చేసింది.