కరోనాతో ఏపీ ఎమ్మెల్సీ మృతి..

61
challa ramakrishna reddy

దేశంలో కరోనా కొత్త వెరియంట్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారీన పడగా చాలామంది మృత్యువాతపడ్డారు. తాజాగా ఏపీకి చెందిన వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి మృతి చెందారు.

గత నెల 13న కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ పరిస్ధితి విషమించడంతో ఇవాళ మృతిచెందారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మృతి చెందారు. 1983 నుంచి చల్లా రామకృష్ణారెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. రైతుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చల్లా…జాతీయ కృషి పండిట్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.