ఒలింపిక్స్‌ పతకం సాధిస్తా: పీవీ సింధు

64
sindhu

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించి తీరుతానని స్పష్టం చేశారు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. న్యూట్రిషన్‌‌ ట్రెయినింగ్‌‌ కోసం ప్రస్తుతం ఇంగ్లండ్‌‌లో ఉన్న సింధు.. థాయ్‌‌లాండ్‌‌ టోర్నీల కోసం ఎదురుచూస్తున్నానని వెల్లడించింది.

ట్రెయినింగ్‌‌కు కావాల్సినంత టైమ్‌‌ దొరికింది. అందువల్ల నా బెస్ట్‌‌ ఇస్తానని నమ్మకంగా ఉన్నా….. ఒలింపిక్స్‌‌ కోసం ప్లాన్స్‌‌ సిద్ధం చేసుకున్నా అని తెలిపింది.ఒలింపిక్స్‌‌లో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ నేను నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది.

కరోనా దెబ్బకు విధించిన లాక్‌‌డౌన్‌‌ వల్ల స్టార్టింగ్‌‌లో అన్నీ మూతపడ్డాయి. ప్రాక్టీస్‌‌కు కూడా చాన్స్‌‌ లేకుండా పోయింది. ఇప్పుడు అన్నీ మొదలయ్యాకా అంతా బాగానే ఉందని తెలిపింది.