విశాల్ ‘సామాన్యుడు’ టీజర్ అదిరింది..

35

హీరో విశాల్ ‘సామాన్యుడు’ చిత్రంతో తు ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ఉపశీర్షికగా ఫిక్స్ చేశారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను విశాల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విశాల్‌కు జోడీగా డింపుల్ హయతి కనిపించనుంది. జనవరి 26వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు.

“ఇక్కడ రెండు రకాల మనుషులే ఉన్నారు. ఒకరు జీవితాన్ని అది నడిపించే దారిలో నడవాలనుకునే సామాన్యుడు. ఇంకొకరు ఆ సామాన్యుడిని డబ్బు .. పేరు .. అధికారం కోసం అంతం చేయాలనుకునే రాక్షసులు. ఆ రాక్షసుల తలరాతను మార్చి రాయవలసిన పరిస్థితి ఒక రోజున ఒక సామాన్యుడికి వస్తుంది” అనే విశాల్ వాయిస్ తో ఈ టీజర్ మొదలైంది. లవ్ .. మాస్ యాక్షన్ తో కూడిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఒక సామాన్యుడు కొంతమంది అవినీతి పరులకు వ్యతిరేకంగా ఎదురువెళ్లడమే ఈ చిత్ర కథ.

Saamanyudu Official Teaser | Vishal | Yuvan Shankar Raja | Thu.Pa.Saravanan