న్యూఇయర్‌ వేడుకలపై తెలంగాణ సర్కారు ఆంక్షలు..

40

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఇయర్‌ వేడుకలపై సర్కారు ఆంక్షలు విధించింది. ఈరోజు నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని, జనవరి 2, 2022 వరకు కొనసాగుతాయని ప్రభుత్వ జీవోలో పేర్కొంది. వేడుకలు నిర్వహించుకునే ప్రదేశంలో భౌతికదూరం పాటించాలని ఆదేశించింది. మాస్క్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను విధించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.