విశాల్.. ‘సామాన్యుడు’ టీజర్ విడుదల

37
vishal

విశాల్ ‘సామాన్యుడు’ చిత్రంతో తు ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ఉపశీర్షికగా ఫిక్స్ చేశారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను విశాల్ నిర్మిస్తున్నారు. నేడు ఈ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

ఇక్కడ రెండు రకాల మనుషులే ఉన్నారు.. ఒకరు జీవితాన్ని అది నడిపించే దారిలో జీవించాలనుకునే సామాన్యులు.. ఇంకొకరుఆ సామాన్యుల్ని డబ్బు, పేరు, పదవి, అధికారం కోసం అంతం చేయాలనుకునే రాక్షసులు.. ఆ రాక్షసుల తల రాతని మార్చి రాయాల్సిన పరిస్థితి ఒక రోజు ఓ సామాన్యుడికి వస్తుంది’ అనే డైలాగ్‌తో టీజర్ సాగుతుంది.

టీజర్‌ను బట్టి చూస్తే ఫుల్ యాక్షన్ మోడ్‌లో సినిమా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇలాంటి పాత్రల్లో నటించడం విశాల్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇక డింపుల్ హయతి అందంగా కనిపించారు. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా కుదిరాయి.

యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కానుంది. నటీనటులు : విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి

సాంకేతిక బృందం

డైరెక్టర్ : తు ప శరవణన్
నిర్మాత : విశాల్
సంగీతం : యువన్ శంకర్ రాజా
డీఓపీ : కెవిన్ రాజా
ఎడిటర్ : ఎన్ బి శ్రీకాంత్
ఆర్ట్ : ఎస్ఎస్ మూర్తి
కాస్ట్యూమ్ డిజైనర్ : వాసుకి భాస్కర్
పీఆర్వో : వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైన్ : విక్రమ్ డిజైన్స్