ఇకపై ఆ 1800 మంది పిల్లల బాధ్యత నాదే..

95
- Advertisement -

పునీత్ మరణం తీరని లోటని, ఆయన మరణించారన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు హీరో విశాల్‌. ఆయన సోమవారం హైద‌రాబాద్‌లో జరిగిన ‘ఎనిమి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. పునీత్ మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. పునీత్ కేవలం మంచి నటులే కాదు.. గొప్ప మనిషి. ఒక మనిషి ఇన్ని సహాయ కార్యక్రమాలు చేయగలరా? అని అనిపించింది. ఓ ప్రభుత్వం చేయాల్సిన పనిని ఆయన చేశారు. 1800 మంది పిల్లలను చదివిస్తున్నారు. ఆయన స్నేహితుడిగా నేను ఆయనకు చేయగలిగింది ఇదే. ఆ 1800 మంది పిల్లల బాధ్యతను నేను తీసుకుంటాను. వచ్చే ఏడాది వారిని నేను నడిపిస్తాను. వారికి అండగా ఉంటాన‌ని హామీ ఇస్తున్నాను’ అని విశాల్‌ అన్నారు.

- Advertisement -