నిరుపేదలకు శారదాపీఠం ఆపన్న హస్తం..

411
Swami Swaroopanandendra
- Advertisement -

కరోనా కారణంగా నిరాశ్రయులైన నిరుపేదలకు విశాఖ శారదాపీఠం ఆపన్న హస్తం అందించింది. పీఠం పరిసరాల్లో నివసించే నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. చినముషిడివాడలోని పీఠం ప్రాంగణంలో గురువారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర తమ చేతుల మీదుగా నిత్యావసర సరుకుల కిట్లను నిరుపేదలకు అందజేశారు. పది కిలోల బియ్యంతో పాటు పంచదార, ఉప్పు, కారం, వంట నూనె, పప్పు దినుసులు తదితరాలతో కిట్ తయారుచేశారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా సామాజిక స్పృహతో విశాఖ శారదాపీఠం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర తెలిపారు. భగవంతుని సేవ కన్నా భాగవతుని సేవ గొప్పదిగా విశాఖ శారదాపీఠం భావిస్తుందన్నారు. కష్టకాలంలో అన్నార్తులను ఆదుకోవడం, మానవత్వాన్ని చాటుకోవడం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించాలని సూచించారు

- Advertisement -