లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలి- పీసీ

173
pc anjani kumar
- Advertisement -

లాక్‌డౌన్ సమయంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖల సిబ్బందికి సామాజిక దృక్పథంతో చేయూతను అందించడానికి వివిధ కంపెనీలు ముందుకు రావడంపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనికుమార్ అభినందించారు. ఈ సందర్భంగా కోఠి, ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో ప్రముఖ నెస్లే కంపెనీ ఆధ్వర్యంలో కిట్ కట్ చక్లేట్లను,జ్యూస్ డబ్బాలను సిపి పోలిస్ సిబ్బందికి, మీడియాకు,పారిశుధ్య కార్మికులకు అందజేశారు.

police commissioner anjani kumar

నగరంలో వివిధ చెక్‌పోస్ట్‌ల్లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి ఇవ్వనున్నట్లు తెలిపారు.లాక్‌డౌన్ అమలై నెల రోజూలైన సందర్భంగా సహకరించిన ప్రజలకు,అహర్నిశలు విధి నిర్వహణలో కృషిచేస్తున్న పోలిస్, డాక్టర్స్,పారిశుధ్య కార్మికుల సేవలను కొనియాడారు.ఈ కరోనా మహమ్మరిని బయట పడాలంటే మరికొన్ని రోజులు అందరూ సహకరించాలని నగర పోలీస్ కమిషన్ అంజనికుమార్ కోరారు.

- Advertisement -