ఆక్లాండ్‌లో టీమిండియా.. ఫోటో షేర్‌ చేసిన కోహ్లీ..!

295

సుదీర్ఘ పర్యటన కోసం విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ చేరుకుంది. ఈ నెల 24 నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులను ఆడనుంది. కాగా ఈ సిరీస్‌కు గాయం కారణంగా ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమయ్యాడు. ధావన్‌తో పాటు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా గాయం కారణంగా న్యూజిలాండ్ పర్యటనకి దూరమయ్యాడు.

అయితే న్యూజిలాండ్‌ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు చల్లటి గాలులతో కూడిన వాతావరణంలో సంతోషంగా గడిపారు. బుధవారం జిమ్‌ సెషన్‌లో కసరత్తులు చేసిన తర్వాత బ్యూటిఫుల్‌ ఆక్లాండ్‌లో పసందైన విందు ఆరగించినట్లు కోహ్లీ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌, మనీశ్‌ పాండేలతో లంచ్‌ చేస్తుండగా సెల్ఫీ తీసిన ఫొటోను కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు.