మయాంక్ ..ఓపెనర్‌గా రికార్డు

84
mayank

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో సెంచరీతో సత్తాచాటాడు భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్. మిడిలార్డర్ నిరాశపరిచినా.. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ సత్తాచాటాడు. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని కెరీర్‌లో నాలుగో సెంచరీని నమోదుచేశాడు. 11 ఏళ్ల తర్వాత స్వదేశంలో కివీస్‌పై సెంచరీ చేసిన భారత ఓపెనర్‌గా నిలిచాడు మయాంక్‌ అగర్వాల్‌. 2010లో సెహ్వాగ్‌ ఈ ఫీట్‌ సాధించాడు. ఏ వేదికపై అయినా 2014లో ధవన్‌ తర్వాత కివీ్‌సపై శతకం బాదిన ఓపెనర్‌ కూడా మయాంక్‌ ఒక్కడే.

రెండోరోజు తొలి సెషన్ ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కొల్పోయి 285 పరుగులు చేసింది. మయాంక్ 146,అక్షర్ పటేల్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ కొల్పోయిన ఆరు వికెట్లు స్పిన్నర్ అజాజ్ పటేల్ తీసినవే.

భారత్: మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌

న్యూజిలాండ్ : టామ్ లాథమ్ (కెప్టెన్‌), విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ (వికెట్‌ కీపర్‌), రచిన్ రవీంద్ర, కైల్ జామీసన్, టిమ్ సౌథీ, విలియం సోమర్‌విల్లే, అజాజ్ పటేల్