ఐపీఎల్-11లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో కనీసం ప్లే ఆఫ్‌కి కూడా చేరకుండానే నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులకు ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా పోస్టు చేశాడు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా ప్లే ఆఫ్‌కు చేరకుండా వెనుతిరిగినందుకు అభిమానులకు క్షమాపణలు తెలియజేశాడు. ఈ వీడియోలో తమ జట్టు ఓటమి గల కారణాలు, వచ్చే ఐపీఎల్ లో తమ జట్టు వ్యూహాలపై గురించి వివరించాడు.
హాయ్.. ఆర్సీబీ అభిమానులందరికీ ఈ వీడియో ద్వారా నేనొక విషయం చెప్పాలనుకుంటున్నా… ఈ ఐపీఎల్ సీజన్లో గొప్ప ప్రదర్శన చేయలేక పోయాం, మా ఆట తీరు మిమ్మల్ని బాధించింది. అభిమానులు మా మీద పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా లక్ష్యాన్ని చేరుకోలేదు, అందుకు నా క్షమాపలు అంటూ వీడియోలో తెలియజేశాడు.
ఈ నేపథ్యంలో వీడియో పోస్టు చేస్తూ… కామెంట్ కూడా పెట్టాడు. మీరు గెలుస్తారు లేదా నేర్చుకుంటారు అనే భావనను నిజంగా నమ్ముతున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ సీజన్లో చేసిన తప్పులను వచ్చే సీజన్లో మళ్లీ జరగకుండా.. వాటిని పాఠాలుగా నేర్చుకొని, కచ్చితంగా మేము బలమైన జట్టుగా బరిలోకి దిగుతాం. అభిమానులు జాగ్రత్త అని కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆర్సీబీలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్ననపటికీ… ఇంతవరకు ఒక్కసారి కూడా చాంపియన్‌గా నిలవకపోవడం విశేషం.