టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌..

150
Delhi Capitals

ఐపీఎల్‌-13లో అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ రెండు జట్లు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. రహానె, అక్షర్‌ పటేల్‌, డేనియల్‌ శామ్స్‌ తుది జట్టులోకి వచ్చినట్లు శ్రేయస్‌ చెప్పాడు. మరోవైపు బెంగళూరు జట్టులోనూ మార్పులు జరిగినట్లు విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు. గుర్‌కీరత్‌ మన్‌, నవదీప్‌ సైనీ స్థానంలో శివమ్‌ దూబే, శాబాజ్‌ అహ్మద్‌ తుది జట్టులోకి వచ్చారు. ఈ ఆసక్తికర పోరులో విజయం సాధించిన జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంటుంది.

తుది జట్లు..
ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్ (C), రిషబ్ పంత్ (WC), మార్కస్ స్టోయినిస్, డేనియల్ సామ్స్, ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: జోష్ ఫిలిప్, దేవదత్ పాడికల్, విరాట్ కోహ్లీ (C), ఎబి డివిలియర్స్ (WC), వాషింగ్టన్ సుందర్, శివం దుబే, షాబాజ్ అహ్మద్, క్రిస్ మోరిస్, ఇసురు ఉదనా, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.