కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోవడం లేదు అని లేఖలో పేర్కొన్నారు. బెంగళూరు, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి కేంద్రం హైదరాబాద్ మెట్రో విస్తరణ విషయంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
మెట్రో ఫేజ్-2కు రూ.24,269 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డు కోసం రూ.34,367 కోట్లు, మూసీ పునరుజ్జీవానికి రూ.10 వేల కోట్లు కోరినా ఇవ్వలేదు అన్నారు. సొంత రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాలకే కిషన్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారు అని లేఖలో ప్రస్తావించారు.
తెలంగాణ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు అనుమతులు సాధించడం, నిధులు మంజూరు చేయించడం మీ నైతిక బాధ్యత. ఇదే విషయాన్ని నేను బహిరంగంగానే పలుమార్లు ప్రకటించాను అన్నారు. రాష్ట్రానికి నిధుల మంజూరుపై ప్రధానమంత్రిని కలిసి వినతులు అందజేయండతో పాటు మిమ్మల్ని స్వయంగా కలిసి అన్నీ వివరించిన తర్వాత కూడా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని.. విధానాన్ని అనుసరించడం లేదని మీరు మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరం అన్నారు.
Also Read:కిషన్ రెడ్డిపై మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్

