రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం..

151
rcb

నేడు జరిగిన ఐపీఎల్‌-13లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ బ్యాటింగ్‌తో దుమ్ములేపాడు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుత ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్నందించాడు. రాజస్థాన్‌ నిర్దేశించిన 178 పరుగుల ఛేదనలో డివిలియర్స్‌(55 నాటౌట్:‌ 22 బంతుల్లో 1ఫోర్‌, 6సిక్సర్లు) వీరవిహారం చేయడంతో మరో నాలుగు బంతులు మిగిలుండగానే 7 వికెట్లతో బెంగళూరు గెలిచింది.

దేవదత్ పడిక్కల్ (35), కెప్టెన్ కోహ్లీ (43) ఇన్నింగ్స్ ను సరైన దిశలో నడిపించగా, ఏబీ తన సీనియారిటీని చాటుకుంటూ రాజస్థాన్ బౌలర్లను ఉతికారేశాడు. అంతకుముందు, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. దుబాయ్ లో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో నెగ్గిందంటే అందులో డివిలియర్స్ పాత్ర కీలకం.