అన్నదమ్ముల ఫిట్‎నెస్ సవాల్…

391
Naga Chaitanya accepts Akkils fitness challenge
- Advertisement -

కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాధోడ్ ‘హమ్‌ ఫిట్‌ హైతో ఇండియా ఫిట్’ కొత్త ఛాలెంజ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన పుషప్స్ చేస్తున్న వీడియోని హీరో హృతిక్ రోషన్, సైనా నెహ్వాల్ , విరాట్ కోహ్లీకి సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్‎ని హీరో హృతిక్ స్వీకరించి తాను జాగింగ్, సైక్లింగ్ చేస్తున్న వీడియోను పోస్టు చేశాడు. సైనా కూడా జిమ్‎లో కసరత్తు చేస్తున్న వీడియోని షేర్ చేసి.. గంభీర్, రాణా, పి.వి సింధులకు సవాల్ విసిరింది. సింధు సైతం ఇందులో పాల్గొని అక్కినేని అఖిల్‎కు పోస్టు చేసింది.

.ఇక అఖిల్ కూడా తాను జిమ్‎లో కసరత్తులు చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఛాలెంజ్‎ని  నాగార్జున,  నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, వరుణ్ ధావన్‎లకు సవాల్ విసిరాడు. అఖిల్ విసిరిన సవాలన్‎ను నాగచైతన్య స్వీకరించి తాను జిమ్‎లో పుషప్స్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. చైతూ కూడా మరో నలుగురికి ట్యాగ్ చేశాడు. ఇందులో సమంత, నిధి అగర్వాల్, సుశాంత్‎లు ఉన్నారు.

ఇక కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాధోడ్ విసిరిన సవాల్‎ని స్వీకరించిన కోహ్లీ దానిని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ట్యాగ్ చేశారు. దీనికి మోడీ సైతం రిప్లై ఇచ్చారు. కోహ్లీ విసిరిన ఫిట్ నెస్ ఛాలెంజ్‌ని తాను స్వీకరిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో తెలిపారు. చాలెంజ్‎ని అంగీకరిస్తున్నా విరాట్. త్వరలోనే నా యోగా వీడియోను షేర్ చేస్తా అని మోడీ పేర్కొన్నారు.

- Advertisement -