ఆర్సీబీకి కరోనా షాక్‌..

56
rcb

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నఐపీఎల్‌14 సీజన్‌ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్‌లో భాగంగా కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో మొదటి పోరు జరగనుంది. కానీ, ఈ లోపే ఆర్సీబీకి గట్టి షాక్ తగిలింది. డాషింగ్ ఓపెనర్ దేవ్ దత్ పడిక్కల్ మొదటి మ్యాచ్ కు దూరమయ్యాడు. ఎందుకంటే అతడికి కరోనా పాజిటివ్ రావడమే అందుకు కారణం. దీంతో అతడిని ఆర్సీబీ యాజమాన్యం ఐసోలేషన్‌లో ఉంచింది. గత ఏడాది జరిగిన ఐపీఎల్‌లో పడిక్కల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడు ఆర్సీబీకి తొలి రెండు మ్యాచ్ లకు దూరమవడం పెద్ద లోటేనని చెబుతున్నారు.

ఇక ఇప్ప‌టికే ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్లేయ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ కూడా శ‌నివారం క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఇక ఇంత‌కుముందు కొవిడ్ పాజిటివ్‌గా తేలిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఆల్‌రౌండ‌ర్ నితీష్ రాణా.. దాని నుంచి కోలుకొని మ‌ళ్లీ టీమ్‌తో చేరాడు. అటు చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను కరోనా వ‌ద‌ల్లేదు. కంటెంట్ టీమ్‌లోని స‌భ్యుడు ఒక‌రు క‌రోనా బారిన ప‌డ్డాడు. గ‌తేడాది యూఏఈలో టోర్నీ సంద‌ర్భంగానూ చెన్నై టీమ్‌ను కరోనా క‌ల‌వ‌ర‌పెట్టింది. ఢిల్లీ, చెన్నై మ‌ధ్య మ్యాచ్‌కు వేదికైన వాంఖ‌డే స్టేడియంలో సిబ్బంది కూడా క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే.