వరుడు కావలెను…ట్రైలర్

59
Varudu kavalenu

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్‌, టీజర్‌కు మంచి స్పందనరాగా సాంగ్‌కు అయితే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 29న సినిమా విడుదల కానుండగా తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ని పూర్తి చేసుకుంది.

ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. తాజాగా సినిమా ట్రైలర్‌ను గురువారం రానా దగ్గుబాటి విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఆకాష్ పాత్రలో నాగశౌర్య, భూమి పాత్రలో రీతూ వర్మ కనిపించారు.

Varudu Kaavalenu Theatrical Trailer | Naga Shaurya, Ritu Varma | Lakshmi Sowjanya