ఓటీటీలో దూసుకుపోతున్న ‘వరుడు కావలెను’

27
varudu kavalenu

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగశౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్‌గా నటించారు.

ఈ సినిమా గత అక్టోబర్ 29న థియేటర్లలో విడుదలై చక్కటి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సినిమాకి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ జీ5లో విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే 5 కోట్ల నిమిషాల వ్యూస్ ని అందుకోవడం విశేషం. దీంతో టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 5 కోట్ల వ్యూ మినిట్స్ అందుకున్న చిత్రంగా రికార్డు సెట్ చేసింది.