అక్టోబర్ 15న వరుడు కావలెను..

166
Varudu-Kavalenu
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్‌, టీజర్‌కు మంచి స్పందనరాగా సాంగ్‌కు అయితే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ‘దిగు దిగు దిగు నాగ’ అనే మాస్‌ లిరికల్ సాంగ్‌ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.

తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు మేకర్స్ . ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

- Advertisement -