ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్..

113
komuambhim
- Advertisement -

జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవిబిడ్డల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన కొమురం భీమ్ ఆదివాసీల ఆరాధ్యదైవం అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా నేడు ఘన నివాళులు అర్పించారు. కొమురం భీమ్ చిన్నతనం నుంచే పోరుబాట పట్టి తన ప్రజల కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, బానిసత్వపు సంకెళ్లు తెంచడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులని, పోరాటయోధులని కొనియాడారు.

కొమురం భీమ్ ఆశయాలను సీఎం కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. మా తండాలో మా రాజ్యం అన్న ఆయన నినాదాన్ని నిజం చేసింది కేసిఆర్ గారి సర్కార్ అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేయాలన్న సుదీర్ఘకాల డిమాండ్ ను నెరవేర్చి గిరిజనులకు తండాలో పాలనాధికారాన్ని అందించిన నేత సీఎం కేసిఆర్ గారు అన్నారు.

కొమురం భీమ్ కొట్లాడిన పోరుగడ్డ జోడే ఘాట్ లో 25 కోట్లతో కొమురం భీమ్ స్మారక చిహ్నం, ఆయన స్మృతి వనం, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసి ఆయన పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియ జేసే గొప్ప ఉద్యమ కేంద్రంగా తయారు చేశారన్నారు.జోడే ఘాట్ లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ ప్రగతి పథంలో నిలిపారన్నారు.

హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్ లో ఆదివాసీల ఆత్మగౌరవం నిలిపేలా 25 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో కొమురం భీమ్ ఆదివాసీ భవన్ నిర్మాణం చేశారన్నారు. కొమురం భీమ్ అడవిబిడ్డల ఆత్మగౌరవ ప్రతీక అని, ఆయన జయంతి సందర్భంగా గిరిజనులు ఆయన పోరాట స్ఫూర్తిని నెమరువేసుకోవాలని సూచించారు.నేడు కొమురం భీమ్ జయంతి అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ఆయన జయంతి సందర్భంగా మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఘన నివాళులు అర్పించారు.

- Advertisement -