పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను బలపర్చాలని కోరారు సురభీ వాణీదేవి. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,గంగుల కమలాకర్‌తో కలిసి సనత్ నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వాణీదేవి..తనపై నమ్మకం ఉంచి పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నన్ను గెలిపిస్తే మీ గొంతుకనవుతానని హామీ ఇచ్చారు. విద్యారంగంలో 35 ఏండ్ల అనుభంవం ఉందని చెప్పారు.
ఆరేండ్లు ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్నో ఏండ్లుగా అమలుకాని ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులిచ్చామని చెప్పారు. పీవీ నరసింహారావు కూతురుగా కాకుండా, విద్యావేత్తగా వాణీదేవిని మొదటి ప్రాధాన్యతా ఓటుతో గెలిపించాలని కోరారు.ఎన్నికలప్పుడు ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తామన్న బీజేపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతుందని విమర్శించారు.