ఆర్కే బీచ్‌లో గల్లంతైన కుటుంబాలను ఆదుకుంటాం:తలసాని

22
talasani

విశాఖపట్నం ఆర్కే బీచ్ లో గల్లంతై మృతి చెందిన యువకుల కుటుంబాలను ఆదుకుంటాం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. విహార యాత్ర కోసం విశాఖపట్నం వెళ్ళి అక్కడి RK బీచ్ లో రసూల్ పురాకు చెందిన శివ, శివ కుమార్, అజీజ్ అనే ముగ్గురు యువకులు మృతిచెందిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మృతుల నివాసాల వద్దకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి తలసాని.ఈ సందర్భంగా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున మూడు కుటుంబాలకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. మృతులు నిరుపేద కుటుంబాలకు చెందిన యువకులు.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ సహాయం అందించేలా కృషి చేస్తాం అన్నారు.