రామ్ చరణ్‌కు పవన్‌ సర్‌ప్రైజ్

20
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ మేరకు పవన్ కళ్యాణ్ లిఖితపూర్వకంగా ఓ లేఖ రాసి విషెస్ చెప్పారు. రామ్ చరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనలోని సామాజిక బాధ్యతను తెలియచేస్తున్నాయి అన్నారు.

వెండి తెరపై కథానాయకుడిగా తనదైన శైలిని ఆవిష్కరిస్తున్న రామ్ చరణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్నారు. నటనలో విభిన్న శైలి చూపడం, పెద్దలపట్ల గౌరవ భావన, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల బాధ్యత… రామ్ చరణ్ ఎదుగుదలకు కచ్చితంగా దోహదం చేస్తాయి. సమున్నత స్థాయిలో నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు.

రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, ఆనందోత్సాహాలు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తొలి చిత్రం నుంచీ ప్రతి అడుగులో ప్రేక్షకులను మెప్పిస్తూనే… ఎప్పటికప్పుడు నవ్యరీతిలో పాత్రలను ఎంచుకొంటున్నారు.

Also Read:వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

- Advertisement -