- Advertisement -
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్ ఓం బిర్లా. లోక్ సభ జరుగుతుండగా ప్రియాంక గాంధీ దగ్గరకు వచ్చిన రాహుల్.. ఆమె బుగ్గలు నిమిరి పలుకరించారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ్యులందరికీ కీలక సూచనలు చేశారు.
ఎంపీలంతా సభా మర్యాదలను పాటించాల్సిందేనని అన్నారు. సభలో ఎలా ప్రవర్తించాలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. తల్లీకూతుళ్లు, తండ్రీకూతుళ్లు, భార్యాభర్తలు, అన్నాచెల్లెళ్లు అయినప్పటికీ తప్పకుండా అందరూ సభ నియమాలు పాటించాలి అని తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read:వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- Advertisement -

