2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని వెల్లడించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పోలవరం నిర్వాసితులకు రూ.4,311 కోట్లు చెల్లించామని అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ కోసం నిర్వాసితులు వేల ఎకరాల్లో భూములు త్యాగం చేశారని గుర్తు చేశారు. నిర్వాసితులను చూస్తే తనకు బాధేస్తోందని.. వరదలు వచ్చినా గత ప్రభుత్వం ఇటు వైపు కూడా చూసిన దాఖలాలు లేవన్నారు. ఎప్పుడో పూర్తి కావాల్సి ప్రాజెక్టును జగన్ సర్కార్ మరుగును పడేసిందని.. ఇప్పుడు ప్రాజెక్ట్ ఆలస్యమై.. ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు.
Also Read:వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
రూ.829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాలో వేసిన ఘనత మా ప్రభుత్వానిది. పోలవరంలో నీళ్లు వదిలే ముందే.. 2027 నవంబర్ నాటికి పునరావాసం పూర్తిచేస్తాం అని స్పష్టం చేశారు. పోలవరం నిధులను గత సర్కార్ యథేచ్ఛగా దారి మళ్లించిందని ఆరోపించారు. 2027 నాటికి పునరావాసం పూర్తి చేస్తామని.. నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వదుతామని స్పష్టం చేశారు.

