కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు

10
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు భగ్గుమంది. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ కార్యక్రమంలో మరోసారి అసంతృప్తి గళం వినిపించారు గద్వాల్ ఇన్ ఛార్జ్ సరిత. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంపత్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు సరిత వర్గీయులు.

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేరిక సమయంలో సమన్యాయం చేస్తానని హామీ ఇచ్చారు..ఆవు ముందు భాగం మాకు, వెనక భాగం వాళ్లకు ఇచ్చారు అన్నారు. మేత మేము వేస్తున్నాం.. పాలు వాళ్ళు తీసుకుంటున్నారు..రోజుకో కార్యకర్త మీద కేసు అవుతుంది.. పోలీసులు మాకు స్పందించరు అని ఆవేదన వ్యక్తం చేశారు.

మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామో లేమో అర్ధం కావట్లేదు.. మేము ఏం మొహం పెట్టుకుని ఊర్లలో తిరగాలి చెప్పాలన్నారు. మా కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయాలి.. 15 నెలలు ఓపిక పట్టినం.. ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి చెప్పాలన్నారు గద్వాల్ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ సరిత.

Also Read: సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

- Advertisement -