18న బుల్లితెర‌పై ‘వ‌కీల్ సాబ్’ సంద‌డి..

98

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటివల నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ సినిమా పింక్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ మూవీ త్వరలో ‘జీ తెలుగు’లో టెలికాస్ట్‌ కాబోతోంది. ఈ విషయం తెలియజేస్తూ ‘జీ తెలుగు’ తన ట్విట్టర్‌ పేజీలో ఓ ప్రకటన చేసింది. ‘గుండెతో స్పందిస్తాడు . అండగా చెయ్యందిస్తాడు’ అని తెలుపుతూ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో ‘వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌’గా త్వరలోనే జీ తెలుగులో ఈ చిత్రం రాబోతోంది అని తెలియజేశారు.

ఈ సినిమా ఈ నెల 18న జీ తెలుగులో సాయత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటించింది. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో అనన్య,అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్‌లు కనిపించారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలోనే కాకుండా అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలై అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. మరి టీవీల్లో ఎలా రేటింగ్స్‌ను సాధిస్తుందో చూడాలి.