అక్కినేని ఫ్యాన్స్‌కు అఖిల్‌ షాక్‌.. ఏజెంట్ ప్రీ లుక్..

29
Akhil Akkineni

సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో అఖిల్‌ అక్కినేని నటిస్తున్న సినిమా ఏజెంట్‌. ఫుల్‌ యాక్షన్‌ మూవీగా తయారయ్యే ఈ సినిమాలో ఓ అండర్‌కవర్‌ ఆపరేషన్‌ చేసే ఏజెంట్‌ పాత్రలో అఖిల్‌ కనిపించనున్నారు. అఖిల్‌ నటిస్తున్న 5వ చిత్రం​గా ఈ సినిమా రూపొందుతుంది. సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి ఇందులో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్‌ షూటింగ్‌ ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

తాజాగా అఖిల్ ఏజెంట్ లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులో కండ‌ల తిరిగిన దేహంతో వర్క‌వుట్స్ చేస్తున్న‌ట్టు క‌నిపించారు అఖిల్. ఈ ఫొటోని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన సురేంద‌ర్ రెడ్డి.. ‘ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు ఉంది పండగ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. అఖిల్‌ బాడీపై కొమ్ములు కలిగిన మేక టాటూ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తుంది. ఏజెంట్‌ లోడింగ్‌. వైల్డ్‌ రైడ్‌కు మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. గ‌తంలో ఎప్పుడు లేని విధంగా అఖిల్ ఈ సినిమాలో క‌నిపంచ‌నున్నాడు. ఏదేమైన ఈ ప్రీ లుక్ పోస్ట‌ర్ అభిమానుల‌లో ఆస‌క్తి రేపుతుంది.