మెగాస్టార్‌ డైరెక్టర్‌తో పవర్‌స్టార్‌.. ఆసక్తిరేపుతున్న పోస్టర్‌..

155

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన రాబోయే సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ వరుసగా వస్తున్నాయి. ఈ క్రమంలో భీమ్లా నాయక్‌ నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. అలాగే ప‌వ‌న్ న‌టిస్తున్న మ‌రో చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు కి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 29, 2022న చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.ఇక మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న పవన్ 29వ చిత్రానికి సంబంధించి అప్ డేట్ కూడా వచ్చింది.

ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్‌ను వదిలారు మేకర్స్‌.. యథా కాలమ్.. తథా వ్యవహారమ్ అంటూ ఓ పోస్టర్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్‌లో గతంలో కిక్, రేసుగుర్రం వంటి హిట్ సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాకు కూడా పవర్ స్టార్ ఇమేజీకి తగ్గట్టుగా వంశీ ఓ కథ సిద్ధం చేశారట. ఈ సినిమా కథ గురించి.. ఇతర తారాగణం, టెక్నికల్ సిబ్బంది గురించి అధికారికంగా ప్రకటన రావాల్సివుంది.