రెండు నెలల్లో అందుబాటులోకి వ్యాక్సిన్లు..

55
vaccine

రానున్న 2 నెలల్లో భారీ మోత్తంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డా రణ్‌దీప్ గులేరియా. వ్యాక్సిన్ తయారీదారులు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారని చెప్పారు. విదేశాల నుంచి కూడా వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటున్నాం….కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ల ఉత్పత్తి దేశంలో చాలా ప్లాంట్లలో జరుగుతుందన్నారు.

స్పుత్నిక్-వీ దేశంలోని అనేక సంస్థలతో తయారీ ఒప్పందం కుదుర్చుకుంది….భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొత్త ప్లాంట్లు పెడుతున్నాయన్నారు. జులై-ఆగస్టు నాటికి భారీ సంఖ్యలో డోసులు అందుబాటులో ఉంటాయన్నారు.