60 వేలు దాటిన యాక్టివ్‌ కేసులు

29
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 9111 కరోనా కేసులు నమోదుకాగా 27 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,48,27,226 కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 60,313 కేసులు యాక్టివ్‌గా ఉండగా 4,42,35,772 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో 5,31,141 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.13శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు వైద్యశాఖ పేర్కొంది.

24 గంటల వ్యవధిలో గుజరాత్‌లో ఆరుగురు, ఉత్తర్‌ ప్రదేశ్‌, కేరళలో నలుగురు చొప్పున, ఢిల్లీ, రాజస్థాన్‌లో ముగ్గురు చొప్పున, మహారాష్ట్రలో ఇద్దరు, బీహార్‌, చత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -