India Corona:40 వేలు దాటిన కరోనా కేసులు

43
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 7830 కేసులు నమోదుకాగా 16 మంది మృతిచెందారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 40,125కి చేరగా కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,31,016కి చేరింది.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,47,76,002 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 0.09 శాతంగా ఉండగా రికవరీ రేటు 98.72శాతంగా నమోదైంది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.

కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, యుపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ -19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌లను పంపిణీ చేసినట్లు వైద్యశాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -