స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి- మంత్రి వేముల

49
Minister Prashanth reddy

బాల్కొండ మండల కేంద్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ మరియు ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి చేస్తున్న హెల్త్ సర్వేను మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈరోజు పరిశీలించారు..అనంతరం ఆయన గ్రామపంచాయతీలో సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులతో కోవిడ్ వ్యాప్తిపై మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు.

“కోవిడ్ నియంత్రణకు అందరూ సమన్వయంతో పనిచేయాలి.ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారు.లాక్ డౌన్ పక్కా అమలయ్యేలా చూడాలి.ప్రజల్లో కోవిడ్‌పై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి.గ్రామాల్లో విస్తరించిన మహమ్మారి ప్రజల స్వీయ నియంత్రణతో తగ్గుముఖం పడుతున్నా..ఇంకా అప్రమత్తంగానే ఉండాలి”అని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాస్,డిఎస్పీ రఘు,సిఐ విజయ్,తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.