బాహుబలి… ఇదేం దోపిడి !

212
The looting of Baahubali -2
The looting of Baahubali -2
- Advertisement -

బాహుబలి-2 సినిమాపై ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి మల్టీప్లెక్సులు, కొన్ని థియేటర్ల యాజమాన్యాలు టికెట్ తో పాటు బలవంతంగా ఫుడ్ అండ్ బేవరేజెస్ టోకెన్లు అంటగడుతున్నారంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ దందాపై యాంకర్ రవి సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఆలోచించకుండా ఎంత అడిగితే అంత ఇస్తున్నామని రవి చెప్పాడు. కానీ తన అభిప్రాయం ప్రకారం అడ్డంగా దోచేస్తున్నారని మండిపడ్డాడు. ‘‘బ్రెడ్ ముక్క, కొంచెం చీజ్, రెండు టొమాటో, కీర ముక్కల శాండ్‌విజ్ 70 రూపాయలు. పాప్‌కార్న్ ఏమో 3వందల నుంచి మూడు వందల యాభై రూపాయలంట.. వాటర్ బాటిల్ 40 రూపాయలు. మల్టీ‌ప్లెక్స్‌ల్లో ఫుడ్‌కు విధిస్తున్న చార్జీలు ఇవి… వాలెట్ నుంచి డబ్బులు తీసుకోవడం వ్యాపారం… బట్టలు కూడా లాగేసుకోవడం దారుణం.. నా వాదనతో ఏకీభవిస్తున్నారా’’ అని నెటిజన్లను యాంకర్ రవి ప్రశ్నించాడు. మల్టీ‌ప్లెక్స్‌ లలో ఫుడ్‌ కాస్ట్ పరిస్థితి ఇది అంటూ యాంకర్ రవి ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. నెటిజన్లు రవి వాదనతో ఏకీభవిస్తూనే, యాంకరైన రవినే ఇంత ఆలోచిస్తుంటే… ఇక సగటు సినీ ప్రేక్షకుడి పరిస్థితి ఏంటో తెలిసిందే…

ravi tweett

- Advertisement -