వైసీపీ నేత కాకాణిపై కేసు నమోదు

19
- Advertisement -

వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి షాక్ తగిలింది. కాకాణి గోవర్ధన్ రెడ్డి పై కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులు పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆరోపణలపై, పోలీసులు బాధితులుగా ఫిర్యాదు చేసిన వంటేరు ప్రసన్న, ఆయనపై బహిరంగంగా బెదిరింపులు చేస్తున్నట్లు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో, పోలీసులు కేసు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని, పోలీసు అధికారులు సప్తసముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి బట్టలూడదీస్తామంటూ తీవ్ర పదజాలంతో కాకాణి వ్యాఖ్యలు చేశారు.

Also Read:Vishwak Sen: ‘లైలా’ సెకండ్ సింగిల్

- Advertisement -