బిగ్ బాస్ 5..బిగ్ ట్విస్ట్ రవి ఎలిమినేట్

276
ravi
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఎవరూ ఊహించని విధంగా 12వ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు యాంకర్ రవి. నామినేషన్స్‌ చివరికి రవి, కాజల్ మిగలగా అంతా కాజల్ ఎలిమినేట్ అవుతుందని ఊహించారు. ఇదే ఉహించిన సన్నీ తన వద్ద ఉన్న ఎవిక్షన్ పాస్‌ని కాజల్‌కు ఇచ్చి సేఫ్ చేద్దామని భావించగా అంతా షాక్‌కు గురయ్యేలా కాజల్ సేఫ్ అయి రవి ఎలిమినేట్ అయ్యారు.

రవి ఎలిమినేట్ కావడంతో సిరి, షన్నుఖ్‌తో పాటు సన్నీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి ఆపుకోలేకపోయారు. అయితే రవి మాత్రం ఇంటి సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. అంద‌రికి గుడ్ బై చెప్పి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన ర‌వితో గేమ్ ఆడించాడు నాగార్జున‌. ఎవరు పాస్ ఎవరు ఫెయిల్ అని చెప్పమంటూ ఓ టాస్క్ ఇచ్చాడు. నేను ఫెయిల్ అయ్యాను. అందుకే ఇక్క‌డ ఉన్నాను. నేనేం చెబుతాను సర్ అని రవి అనేశాడు.

షన్ను, శ్రీరామచంద్ర, సన్నీలకు పాస్ అని ఇచ్చిన రవి…డు. మిగతా వాళ్లకు మాత్రం ఫెయిల్ అని ఇచ్చాడు. షన్ను మెచ్యూరిటీకి మారు పేరు.. షన్నుతో కలిసి బిగ్ బాస్ జర్నీ చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నాను గొప్పగా చెప్పాడు. శ్రీరామచంద్రకు ఇంచు కూడా స్వార్థమన్నది ఉండదు.. నీ కోసం నేను బయట ఆడుతాను అని తెలిపాడు రవి.

సన్నీ తోపు సర్.. ఫ్రెండ్ అంటే చాలు ఏదైనా ఇస్తాడు.. ఎంత దూరమైన వస్తాడు.. అది చాలా మంచిది.. దాని వల్లే ఇక్కడి వరకు వచ్చాడు అని ప్రశంసలు గుప్పించాడు. ప్రియాంక గురించి చెబుతూ.. ఏం చేయాలో నీది నువ్వు తెలుసుకో.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వేస్ట్ అని తెలిపాడు. సిరి నా సిస్టర్ ఫెయిల్ అవ్వకూడదని చెబుతున్నా. దేనికీ భయపడకు.. దూసుకుపో.. ఎక్కువ ఆలోచించకు అని తెలిపాడు. మానస్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. క్యాలిక్యులేషన్స్ కరెక్ట్‌గా ఉంటాయని కొనియాడాడు .

- Advertisement -