30లో సమంత..

223
Samantha birthday
- Advertisement -

   అభిమానులతో ఎక్కువ టచ్ లో ఉండడమే కాకుండా పర్సనల్ లైఫ్ నుండి ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకునే కథానాయిక ఎవరు అంటే .. సమంత అని ఠక్కున చెప్పవచ్చు. త్వరలో అక్కినేని కోడలు ప్రమోషన్ అందుకోబోతున్న ఈ బ్యూటీ నేడు 30 వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా సమంతకు గ్రేట్‌ తెలంగాణ.కామ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

సమంత 1987, ఏప్రిల్ 28న జన్మించింది. తల్లి మళయాలి, తండ్రి తెలుగు. చిన్నప్పటి నుంచి చెన్నయ్ లోనే పెరిగింది. అందు వల్ల ఆమె తమిళం చాలా బాగా మాట్లాడగలదు. తన కుటుంబ నేపథ్యం తమిళనాడు కాక పోయినా…అక్కడే పుట్టి పెరగడం వల్ల తనను తాను తమిళియన్ గానే చెప్పుకుంటుంది సమంత.

sam

కెరియర్ ప్రారంభంలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే కుర్రాళ్ల మనసు దోచేసింది. ఆపై తను నటించిన బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.

samantha-in-ye-maaya-chesave-movie

మరోపక్క ఈగ ఏకకాల తమిళ నిర్మాణం నాన్ ఈ, ఎటో వెళ్ళిపోయింది మనుసు ఏకకాల తమిళ నిర్మాణం నీదానే ఎన్ పొన్వసంతం సినిమాలతో తమిళంలో గుర్తింపు సాధించిన సమంత… ఆపై అంజాన్ (2014), కత్తి (2014) సినిమాలతో తమిళనాట కూడా ప్రముఖ కథానాయికగా ఎదిగింది. 2013లో రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత గుర్తింపు పొందింది.

Naga-Chaitanya-Samantha

సమంత తొలి జోడీ నాగచైతన్యనే ప్రేమించిన సంగతి తెలిసిందే. త్వరలో సమంత-నాగ చైతన్య పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ జంటకు నిశ్చితార్థం అయింది కాబట్టి సగం పెళ్లి అయినట్లే. నాగ చైతన్య, సమంత త్వరలో భార్య భర్తలు కాబోతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ఎవరి సినిమాల్లో వారి బిజీగా ఉంటూనే ఇద్దరికీ సమయం దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్, పార్టీల్లో మునిగి తేలుతూ ఎంజాయ్ చేస్తున్నారు. నాగ చైతన్య, సమంత వివాహం ఎప్పుడు? అనే విషయమై ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. అయితే వీరి వివాహం అక్టోబర్ లో జరిగే అవకాశం ఉందని అంటున్నారు..

nag cooking

చరణ్-సుక్కూ ప్రాజెక్ట్ లో కథానాయికగా నటిస్తున్న సమంత, నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న రాజు గారి గది సీక్వెల్ తో పాటు.. సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కనున్న ప్రాజెక్టులో నటించనుంది. పలు తమిళ ప్రాజెక్ట్స్ కూడా ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి.

- Advertisement -