బీఆర్ఎస్ నల్గొండ సభకు హైకోర్టు అనుమతి

19
- Advertisement -

బీఆర్ఎస్ నల్గొండ సభకు హైకోర్టు అనుమతించింది. పలు షరతులు విధిస్తూ పర్మిషన్ ఇచ్చింది. బీఆర్ఎస్ అంటే భార‌త రాష్ట్ర స‌మితినే కాదు.. భార‌త రైతు స‌మితి కూడా అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న‌తో విసుగు చెంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న రైతు కుటుంబాలతో పాటు మిగ‌తా అన్న‌దాత‌ల్లో ఆత్మ‌విశ్వాసం నింపేందుకు ఎల్లుండి నుంచి బీఆర్ఎస్ అధ్య‌య‌న క‌మిటీ జిల్లా ప‌ర్య‌ట‌న‌లు చేస్తుంద‌ని తెలిపారు.

రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ పేరిట ఎన్నో హామీలు ఇచ్చింది. పంట‌కు బోన‌స్, రైతు భ‌రోసా, మ‌ద్ద‌తు ధ‌ర‌, కొనుగోలు కేంద్రాలు పెంచుతామ‌ని చాలా చెప్పారు. ఇవ‌న్నీ న‌మ్మిన రైతులు.. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామంటే విశ్వ‌సించి కాంగ్రెస్ పార్టీకి అధికారం క‌ట్ట‌బెట్టారు. రాజ‌కీయాల్లో విజ‌యాలు, అప‌జ‌యాలు జ‌రుగుతుంటాయి. ఇవ‌న్నీ మాకు పెద్ద విష‌యం కాదు అన్నారు.

రైతు ఏడ్చిన రాజ్యం బాగుండ‌దు. ఇవాళ ఎన్నిక‌లు లేవు.. అధికారంలోకి రావ‌డానికి రాజ‌కీయ‌మైన ప్ర‌య‌త్నం కాదు. ఈ ప్ర‌భుత్వం రైతుల‌కు ఇచ్చిన అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో, ప్ర‌భుత్వ‌ త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో రైతులు నిరాశ‌, నిస్పృహ‌తో ఉన్నారు అని దుయ్యబట్టారు.

Also Read:కుంభమేళా మోనాలిసాకు సినిమా ఆఫర్..!

- Advertisement -