బిగ్ బాస్..కెప్టెన్సీ రేసులో రవి

34
ravi

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా కొనసాగుతోంది. 32వ ఎపిసోడ్‌లో భాగంగా రాజ్యానికి ఒక్కడే రాజుగా రవి ఎంపిక కావడంతో కెప్టెన్సీ పోటీదారులుగా రవికి అవకాశం దక్కగా, ట్రాస్స్‌జెండర్ ప్రియాంకకు సర్‌ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్. దీంతో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.

జండర్ ఛేంజ్ చేసుకున్న ప్రియాంక సింగ్ పట్ల కినుక వహించిన ఆమె తండ్రి మనసు మార్చుకున్నాడు. కూతురుకు బర్త్ డే విషెస్ ను వీడియో ద్వారా తెలిపాడు.దీంతో ప్రియాంక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కన్నీటి పర్యంతం అవుతున్న ప్రియాంకను ఇంటి సభ్యులు ఓదార్చగా ఆమె సోదరుడు చీర పంపగా, బిగ్ బాస్ ఇచ్చిన కేక్ ను అందరకూ కలిసి ప్రియాంకతో కట్ చేయించారు. శ్రీరామ్ .. మగువ మగువా పాటతో శుభాకాంక్షలు అందించాడు.

నాణేలు అత్యధికంగా సన్నీ దగ్గర ఉన్నా ప్రజలు ఎక్కువగా రవి పక్షాన ఉండటంతో రవి టాస్క్‌లో గెలిచినట్లు ప్రకటించారు. దీంతో సభ్యులంతా కలిసి ఊరేగింపుగా తీసుకెళ్ళి, గార్డెన్ లోని సింహాసనం పై అధిష్టింప చేశారు. మొత్తంగా రవికి కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే అవకాశం బిగ్ బాస్ కల్పించాడు.

కెప్టెన్ గా పోటీ చేసే ముగ్గురు వ్యక్తుల పేర్లను తన టీమ్ నుండి ఎంపిక చేసి చెప్పమని కోరాడు. యాని మాస్టర్, హమీదా, శ్వేత పేర్లను రవి నామినేట్ చేశాడు.ఇక్కడే బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చారు. రవి టీమ్ లో కెప్టెన్సీ టాస్క్ లో ఉన్న వారు ఎవరైనా పోటీ నుండి తప్పుకుంటే ప్రియాకు చోటు దక్కుతుందనే తిరకాసు పెట్టాడు. రవి తాను తప్పుకుంటానని చెప్పినా అంగీకరించని ప్రియా, చివరి నిమిషంలో హమీద తప్పుకుంటానని ఒత్తిడి చేయడంతో కాదనలేకపోయింది.

తర్వాత కెప్టెన్సీ కంటెస్టెంట్స్ గా ఉన్న నలుగురు యాని మాస్టర్, ప్రియా, రవి, శ్వేతకు బిగ్ బాస్ ‘పదివేళ్ళు సరిపోవు సోదరా’ అనే టాస్క్ ఇచ్చాడు. నలుగురి పేర్లతోనూ నాలుగు వాటర్ డ్రమ్ములను గార్డెన్ ఏరియాలో పెట్టారు. దానికి చుట్టూ కొన్ని హోల్స్ పెట్టి, సంచాలకుడిగా వ్యవహరిస్తున్న షణ్ముఖ్ ను బజర్ మోగినప్పుడల్లా ఆ నాలుగు డ్రమ్స్ కు చెందిన హోల్స్ కు అడ్డం ఉన్న రబ్బర్ బిట్స్ ను తొలగించమని ఆర్డర్ వేశాడు. టాస్క్ పూర్తయ్యే సరికీ ఎవరి డ్రమ్ములో నీళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళే కెప్టెన్. ఇవాళ ఎపిసోడ్‌లో హౌస్‌కి కొత్త కెప్టెన్ ఎవరనేది తెలిపోతుంది.