దుబాయ్‌ నుండి వచ్చిన బాలుడు.. ప్రైమరీ కాంటాక్టులకు ఒమిక్రాన్

114
omicron

దుబాయ్ నుంచి వచ్చిన బాలుడికి ఒమిక్రాన్ ఉండగా అతడి ద్వారా ముగ్గురు ప్రైమరీ కాంటాక్టులకు కరోనా వైరస్ సోకింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రానగర్ దొడిలో ఓ బాలుడు (15)కి ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. పదిరోజుల కిందట దుబాయ్ నుంచి వచ్చిన అతడికి కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో జీనోమ్ సీక్వెన్సీకి పంపారు. అందులో ఒమి క్రాన్ ఉందని తేలడంతో అతడితో ప్రైమరీ కాం టాక్టు ఉన్న 40 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.

ఇందులో బాలుడికి సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యులు ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో జీనోమ్ సీక్వెన్సీకి పం పారు. వారందరికి కూడా ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది. బాధితులందరు కూడా హోం ఐసోలేషన్లోనే చికిత్స పొందుతున్నారు.