బెజవాడ పాలిటిక్స్‌..అవన్నీ రూమర్సే!

15
arava sathyam son

వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా వంగవీటి రాధాపై గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేవినేని వర్గానికి చెందిన అరవ సత్యంపై పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా అరవసత్యం కుమారుడు చరణ్ తేజ్ స్పందించారు. దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా మొన్న పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు….అదేరోజు అస్వస్థతకు గురికావడంతో హాస్పిటల్‌కు వెళ్లారని కావాలంటే సీసీ కెమెరాలు చెక్ చేసుకోవచ్చన్నారు.

మా కుటుంబంపై బురద జల్లోద్దని విజ్ఞప్తి చేసిన చరణ్ తేజ్‌… మా నాన్న కష్టపడి రాజకీయాల్లో ఎదిగారు…నెహ్రు అడుగుజాడల్లో నడిచారన్నారు. దేవినేని అవినాష్ మా నాన్నకు అండగా నిలుస్తున్నారని… పొలిటికల్ గేమ్ ఆడటానికి ఇది సమయం కాదన్నారు. మా నాన్న రికవరీ అయి బయటికి వచ్చిన తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతారన్నారు. మా నాన్నను ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ కు ఎవరూ తీసుకెళ్లలేదు ఎలాంటి విచారణ జరపలేదన్నారు.