అగ్రరాజ్యంలో ఒమిక్రాన్ బీభత్సం..

28
us

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్…అగ్రరాజ్యం అమెరికాలో బిభీత్సం సృష్టిస్తోంది. ఏకంగా రోజుకు 10 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 3 వారాల్లో ఆస్పత్రులో చేరే వారి సంఖ్య రెట్టింపు అయింది. వర్జీనియా, టెక్సాస్, కెంటకీ, కన్సాస్, చికాగోలలో వైద్యుల్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇక కరోనా కారణంగా చైనాలోని పలు నగరాల్లో తిరిగి లాక్ డౌన్ విధిస్తున్నారు. కోవిడ్‌–19 విలయానికి చైనాలో మూడో నగరం మూతబడింది. 55 లక్షల జనాభా ఉన్న అన్యాంగ్‌ నగరంలో లాక్‌డౌన్‌ విధించి మూకుమ్మడి పరీక్షలు నిర్వహిస్తున్నారు. జియాన్, యుఝో నగరాల్లో ఇప్పటికే లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.