దేశంలో 24 గంటల్లో 9195 కరోనా కేసులు..

68
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 9195 కరోనా కేసులు నమోదుకాగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య సైతం పెరిగిపోతోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 77,002 ఉండగా దేశంలో మొత్తం 781 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ లో అత్యధికంగా 238 కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీలో 238 కేసులు నమోదుకాగా 57 మంది రికవరీ అయ్యారు. మహారాష్ట్రలో 167 కేసులు నమోదుకాగా 72 మంది కోలుకున్నారు. గుజరాత్‌లో 73 కేసులు,కేరళలో 65 కేసులు,తెలంగాణలో 62 కేసులు,రాజస్తాన్‌లో 46 కేసులు,కర్నాటకలో 34 కేసులు,తమిళనాడులో 34 కేసులు,హర్యానాలో 12 కేసులు,పశ్చిమ బెంగాల్‌లో 1 కేసులు నమోదయ్యాయి.